లబ్ధిదారులకు ‘డబుల్’ ఇండ్ల పంపిణీ

లబ్ధిదారులకు ‘డబుల్’ ఇండ్ల పంపిణీ

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం హమీదుల్లా నగర్ గ్రామంలో నిర్మించిన 20 డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో బుధవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​పాల్గొని లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 149 మంది ఆన్​లైన్​లో డబుల్​బెడ్​రూమ్​ ఇల్లు కోసం అప్లై చేసుకోగా, అధికారులు 25 మందిని ఎంపిక చేశారు.

లక్కీ డ్రాలో 20 మందికి ఇల్లు వచ్చాయి. దీంతో మిగిలిన ఐదు మంది ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, సర్పంచ్​సతీశ్​యాదవ్​తో వాగ్వాదానికి దిగారు. సర్పంచ్ వారికి సర్దిచెప్పారు. ఎమ్మెల్యేతో మాట్లాడి డబుల్​బెడ్​రూమ్​ఇల్లు లేదా దళితబంధు స్కీం వచ్చేలా చూస్తానన్నారు. ఖాళీ స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి రూ.3లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో తహసీల్దార్​శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ, ఆర్ఐ సంజీవ పాల్గొన్నారు. అయితే వార్డు సభ్యులు, బీఆర్ఎస్​గ్రామ అధ్యక్షుడు, ఎస్సీ సెల్​అధ్యక్షుడు కుమ్మక్కై డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను అమ్ముకున్నారని గ్రామ కోఆప్షన్ సభ్యుడు రాజ్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హమీదుల్లా గ్రామస్తులకు కాకుండా కొందరు బయటివారికి ఇండ్లు వచ్చేలా చేశారన్నారు. 

శంషాబాద్​లో చలివేంద్రం ఏర్పాటు సోషల్​యాక్టివిస్ట్​కందకట్ల సిద్ధురెడ్డి, సినీ హీరో ఇంద్రసేన కలిసి శంషాబాద్​బస్టాండ్​సమీపంలో ఉచిత మజ్జిగ, మంచినీరు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ ​బుధవారం ప్రారంభించారు.