వైరా, వెలుగు : వైరా మండలం పూసలపాడు సొసైటీ పరిధిలోని, నారాపనేనిపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై అధికారి కే.చందన్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ధాన్యం తేమశాతాన్ని, ఏఎంసీ కొత్తగా ఇచ్చిన మీటర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమశాతం రాగానే మిల్లులకు తరలించే ఏర్పాట్లు పూర్తి చేశామని, మిల్లులకు కూడా ట్యాగ్ చేయడం పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గాలి శ్రీనివాసరావు, సంఘ కార్యదర్శి జీ.చిన్న కృష్ణయ్య, రైతులు పాల్గొన్నారు.
