
- హైదరాబాద్ జిల్లాలోని15 సెగ్మెంట్లకు నియామకం
- జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్
హైదరాబాద్, వెలుగు : కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ జిల్లాలోని15 అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులను నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోని ఐఆర్ఎస్ అధికారులను నియమించగా.. వారికి కేటాయించిన సెగ్మెంట్లలో పర్యటిస్తూ ఆర్ఓతో నోడల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తారని పేర్కొన్నారు.