సిద్దిపేట టౌన్, వెలుగు: నేడు సిద్దిపేటలో ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు, చీఫ్ గెస్ట్ గా జిల్లా ఇన్ చార్జి, మైనింగ్ , కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి పూజల హరికృష్ణ తెలిపారు.
గురువారం పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మదీనా ఫంక్షన్ హాల్ లో నిర్వహించే ఇఫ్తార్ విందుకు పార్టీలకతీతంగా పాల్గొనాలని కోరారు. పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అత్తు ఇమామ్, లీడర్లు కలిముద్దీన్, తప్పెట శంకర్, గయాసుద్దీన్, సతీశ్ గౌడ్ , భిక్షపతి పాల్గొన్నారు.
