
సీఎం జగన్ ది మాటల ప్రభుత్వం కాదని..చేతల ప్రభుత్వం అన్నారు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డనేటర్ లేళ్ల అప్పిరెడ్డి. అగ్రిగోల్డ్ బాధితులు కోసం తొలివిడతలో 3లక్షల 70 వేల మంది బాధితుల కోసం రూ. 264 కోట్లు విడుదల చేసి ఈ దీపావళికి వారి జీవితాల్లో వెలుగుని నింపారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై బాధితులు విశ్వాసం ఉంచారని..వారి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ పునర్జన్మ నిచ్చారని బాధితులు చెప్పుకుంటున్నారని తెలిపారు అప్పిరెడ్డి. ఏ ప్రైవేట్ సంస్థ మోసం చేసిన పాలక ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు.. రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. న్యాయపరమైన ఇబ్బదులు అధిగమించి 1150 కోట్లు నోటి మాటగా కాకుండా జీవో విడుదల చేశారన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పరనేది మరోసారి రుజువైందని తెలిపారు. కోతల ప్రభుత్వం చంద్రబాబుది, జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వం అని తెలిపారు అప్పిరెడ్డి. ఈ నెల 29 తేదీన అన్ని అగ్రిగోల్డ్ బాధిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన ఆయన..భవిష్యత్ లో ఏ అగ్రిగోల్డ్ బాధితుడు ఆత్మహత్య చేసుకోరన్నారు.