హైదరాబాద్, వెలుగు: సంప్రదాయ, ఆధునిక వస్త్రాలను అందించే దివాని స్టోర్హైదరాబాద్లో నటి నమ్రత శిరోద్కర్ చేతుల మీదుగా ప్రారంభమయింది. హైదరాబాద్ నిజాం రాజుల సంస్కృతిని ప్రతిబింబించే ఖడా దుపట్టా, ఫర్షీ ఘరారా వంటి వస్త్రాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. రాగి, వెండి, బంగారు జరీతో చేతితో రూపొందించిన ఈ వస్త్రాలు కళాకారుల నైపుణ్యాన్ని చాటుతున్నాయని నమ్రత చెప్పారు. జర్దోజీ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 500 మందికి పైగా కళాకారులకు ఉపాధి క ల్పిస్తున్నామని దివాని ఫౌండర్ సాన్యా ధీర్ తెలిపారు.
