అడుగేస్తే చరిత్రే.. 24వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌కు విజయం దూరంలో జొకోవిచ్‌‌‌‌

అడుగేస్తే చరిత్రే..  24వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌కు విజయం దూరంలో జొకోవిచ్‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌:  కెరీర్​లో 24వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ను అందుకొని చరిత్ర సృష్టించేందుకు సెర్బియా టెన్నిస్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ మరొక్క అడుగు దూరంలో నిలిచాడు. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో అంచనాలను అందుకుంటూ ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లాడు. డిఫెండింగ్‌‌‌‌ చాంప్‌‌‌‌ టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టిన డానిల్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌తో టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు నొవాక్‌‌‌‌ రెడీ అయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ సెమీఫైనల్లో  రెండో సీడ్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ 6–3, 6–2, 7–6 (7/4)తో 47వ ర్యాంకర్‌‌‌‌  బెన్‌‌‌‌ షెల్టన్‌‌‌‌ (అమెరికా)కు వరుస సెట్లలో చెక్‌‌‌‌ పెట్టాడు. 

యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో పదో సారి ఫైనల్‌‌‌‌ చేరి రికార్డు సమం చేశాడు. 2 గంటల 41 నిమిషాల పాటు సాగిన 20 ఏండ్ల షెల్టన్‌‌‌‌ హై స్పీడ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లతో ఆకట్టుకున్నాడు.  కానీ, నొవాక్‌‌‌‌ తన ట్రేడ్‌‌‌‌మార్క్‌‌‌‌ షాట్లతో అతనికి చెక్‌‌‌‌ పెట్టాడు. ఓవరాల్‌‌‌‌గా ఐదు ఏస్‌‌‌‌లు, 28 విన్నర్లు కొట్టిన నొవాక్‌‌‌‌  ఐదు బ్రేక్‌‌‌‌ పాయింట్లు సాధించాడు. మూడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 25 అన్‌‌‌‌ఫోర్స్​డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేశాడు.  ఐదు ఏస్‌‌‌‌లు, 30 విన్నర్లు కొట్టిన షెల్టన్‌‌‌‌ 2 బ్రేక్‌‌‌‌ పాయింట్లు మాత్రమే సాధించాడు. ఐదు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, ఏకంగా 43 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌తో మూల్యం చెల్లించాడు. 

అల్కరాజ్‌‌‌‌ జోరుకు బ్రేక్‌‌‌‌

వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్​ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ జోరుకు రష్యా స్టార్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ వేశాడు. నాలుగు సెట్ల పాటు సాగిన సెమీస్‌‌‌‌లో మూడో సీడ్‌‌‌‌ డానిల్‌‌‌‌ 7–6 (7/3), 6–1, 3–6, 6–3తో స్పెయిన్‌‌‌‌ స్టార్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ను ఓడించాడు. 3 గంటల 19 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌‌‌‌లో డానిల్‌‌‌‌ ఏకంగా 9 ఏస్‌‌‌‌లు కొట్టాడు.  3 బ్రేక్‌‌‌‌ పాయింట్లు, 38 విన్నర్లు సాధించాడు. 10 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, 32 అన్‌‌‌‌ఫోర్స్​డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసినా  కీలక సమయాల్లో పాయింట్లు నెగ్గి ముందంజ వేశాడు. కార్లోస్‌‌‌‌ డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌ కూడా చేయకపోయినా  38 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్ చేశాడు. కానీ, ఒకే బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో సరిపెట్టిన అతను ఒక్క ఏస్‌‌‌‌ కూడా కొట్టలేకపోయాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగే ఫైనల్లో నొవాక్‌‌‌‌, మెద్వెదెవ్‌‌‌‌ పోటీ పడనున్నారు.