రాహుల్ తో భేటీ కానున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్

రాహుల్ తో భేటీ కానున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్

కర్ణాటక సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఎటూ  తేల్చుకోలేకపోతుంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వేర్వేరుగా భేటీ అయినా అభ్యర్థి ఎంపికపై క్లారిటీ రాలేదు. సీఎం పదవి తమకే ఇవ్వాలంటూ ఇద్దరు నేతలు పట్టుబడుతుండటంతో అభ్యర్థి ఎంపిక సంక్లిష్టంగా మారింది.

ఈ క్రమంలో ఇవాళ  రాహుల్ గాంధీతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య భేటీ కానున్నారు. 11:30 కి రాహుల్ గాంధీతో  సిద్దరామయ్య  భేటీకానున్నారు.  సీఎం పదవి రొటేషన్ విధానంలో  ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భేటీ ముగిశాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

 అయితే సీఎం పదవిని చెరి సగం పంచుకోవడానికి డీకే శివకుమార్ ఒప్పుకోవడం లేదు.  ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదు. ఇప్పటి దాకా అలాంటి ప్రతిపాదనేమీ ముందుకు రాలేదన్నారు.  కాంగ్రెస్ కు వెన్నుపోటుపొడవనని, పార్టీ తనకు తల్లితో సమానమని డీకే శివకుమార్ అన్నారు.