తక్కువ పెట్టుబడి... అధిక దిగుబడి.. హైడ్రోపోనిక్ పద్దతిలో వ్యవసాయం

తక్కువ పెట్టుబడి... అధిక దిగుబడి.. హైడ్రోపోనిక్ పద్దతిలో వ్యవసాయం

దేశ వ్యాప్తంగా రైతులు ఆధునిక పద్దతులు ఉపయోగిస్తున్నారు.  కొత్త పద్దతుల్లో రైతులు అధిక లాభాలు పొందుతున్నారు.  రైతులు సాంకేతికతను అభివృద్ది చేసుకొనేందుకు మీరట్​లోని చౌదరి చరణ్​సింగ్​ యూనివర్సిటీ క్యాంపస్‌లో రైతులకు  రెండు రోజులు ( ఫిబ్రవరి 26,27)  వర్క్‌షాప్ పై శిక్షణ ఇస్తున్నట్లు వృక్షశాస్త్ర ప్రొఫెసర్​ విజయ్​ మాలిక్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో  హైడ్రోపోనిక్ టెక్నాలజీ నిపుణులు మహ్మద్ జావేద్ ఆలం .. మహ్మద్ యూసుఫ్ ఆలం యువ రైతులకు హైడ్రోపోనిక్ వ్యవసాయ చిట్కాల గురించి వివరించనున్నారు. 

హైడ్రోపోనిక్ అనేది గ్రీకు పదం.  ఈ పద్దతిలో  తక్కువ మట్టిలో నీటిని మాత్రమే ఉపయోగించి  వ్యవసాయం చేస్తారు.  ఇది ఆధునిక వ్యవసాయం .  వాతావరణాన్ని నియంత్రించడం ద్వారా వ్యవసాయం చేయవచ్చని ప్రొఫెసర్ విజయ్ మాలిక్ తెలిపారు. నీటితో పాటు కొన్ని గులక రాళ్లు అవసరమని... ఇందులో 15 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది.  తేమశాతం 80 నుంచి 85శాతం వరకు అవసరమవుతుందని తెలిపారు.  నీటి ద్వారా మొక్కలకు పోషకాలు అందిచవచ్చని తెలిపారు. 

హైడ్రోపోనిక్ ఫార్మింగ్‌లో  వ్యవసాయం పైపుల ద్వారా జరుగుతుంది.  పైపులకు రంధ్రాలు చేసి అక్కడ మొక్కలు నాటుతారు.  వేళ్లు మాత్రమే నీటిలో మునిగి ఉంటాయి.  ఈ నీటిని రెండు మూడు రోజులకొకసారి మార్చవలసి ఉంటేంది. .పోషకాలు ఈ నీటిలో కరిగిపోయి  మొక్కను బలోపేతం చేస్తాయి. ఈ సాంకేతికత చిన్న మొక్కలు ఉన్న పంటలకు చాలా మంచిది. క్యారెట్, టర్నిప్, ముల్లంగి, క్యాప్సికం, బఠానీ, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, పుచ్చకాయ, సీతాఫలం, పైనాపిల్, సెలెరీ, తులసి, టొమాటో, ఓక్రా వంటి కూరగాయలు.. పండ్లను హైడ్రోపోనిక్ ఫార్మింగ్‌ విధానంలో పండించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.