
హైదరాబాద్ : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కొంత మంది బీఆర్‌ఎస్ నేతలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాడి చేశారని ఆయనపై కాగజ్‌నగర్ పీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో తనపై చర్యలు తీసుకోవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈనెల 13న రాత్రి.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణకు జరిగింది. దీంతో ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ పై హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదైంది.