ఆలస్యమైందని నిరాశ వద్దు.. అందరికీ న్యాయం జరుగుతుంది

ఆలస్యమైందని నిరాశ వద్దు.. అందరికీ న్యాయం జరుగుతుంది
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్:  కార్యకర్తలు లేనిదే మేము లేము.. మేము లేకపోతే పార్టీనే లేదు.. త్వరలోనే కార్యకర్తలందరికీ కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారు.. ఎవరూ నిరాశపడొద్దు.. కాస్త  ఆలస్యమైనా అందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి గుంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. లేకున్నా లాఠీ దెబ్బలు తిని రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర టీఆర్ఎస్ కార్యకర్తలదని.. కొంత ది పెద్దలు ఓపిక లేక కోయిల ముందే కూసినట్లుగా పార్టీ మారిపోయి హీనులుగా మారారు..  పార్టీ వీడిన వాళ్లందరూ కాలగర్భంలో కలసిపోయారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరం.. కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు.. ఇతర పార్టీల నేతలు మాపై  విమర్శలు చేస్తున్నారు..  మాకు బదులివ్వడం చేతకాక కాదు..  మా మంచితనాన్ని అసమర్ధతగా భావించొద్దు.. అధికారంలో ఉన్న మేము మీలాగా మాట్లాడడం బాగుండదు.. మాకు హద్దులుంటాయి.. ఒకవేళ మాట్లాడితే భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ అనే కుటుంబంలో ఎన్ని విబేధాలున్నా మనందరం కేసీఆర్ కు అండగా ఉండాలి..  స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లలో ఎందరో సీఎంలు, పీఎంలు మారారు, ఇన్నేళ్లలో వెనకబడిన కులాలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు.. 72 ఏళ్ల కాలంలో తెలంగాణలో 19 గురుకులాలు ఏర్పాటు చేస్తే గడిచిన ఆరేళ్లలో 260 బీసీ గురుకులాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది’’ అని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. సీఎం అమలు చేస్తున్న పథకాల వల్ల రైతులు, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.. నాతో సహా అందరం కార్యకర్తలమే.. పార్టీకి విధేయంగా ఉన్న కార్యకర్తలకు తప్పక న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ర్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో రకంగా లబ్ధి పొందింది.. అందుకే చాలా మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. కార్యకర్తలు ప్రజలను కలిసి సభ్యత్వం చేయించాలి..  బలవంతంగా సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుందాం.. ఏదైనా కారణం చేత టీఆర్ఎస్ కార్యకర్త చనిపోయినా పార్టీ తరపున 2 లక్షలు ఇచ్చేలా ఈ సమావేశంలో తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. ఐడీ కార్డులు కూడా అందరికీ వచ్చేలా ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రులను ఉరికిచ్చిన చరిత్ర కేసీఆర్ ది.. మీరెంత?

తెలంగాణకు..నాకు ప్రత్యేక అనుబంధం 

రైతుల పిల్లలకు ఢిల్లీ బోర్డర్ లో వీధి బడి