సోషల్​ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టవద్దు

సోషల్​ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టవద్దు

నారాయణపేట, వెలుగు: పార్లమెంట్  ఎన్నికల సందర్భంగా జిల్లాలో సోషల్​ మీడియాలో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం చేయవద్దని, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేశ్​గౌతమ్​ హెచ్చరించారు.

రాజకీయం, కుల, మత, ప్రాంతాల విషయాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు షేర్  చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పారు. సోషల్​ మీడియాతోపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో సోషల్​ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పోలీసులను ఆదేశించారు.