జడ్చర్ల, వెలుగు : నీళ్ల బాటిల్ అడిగి పుస్తెల తాడు అపహరించిన ఘటన జడ్చర్ల పట్టణంలోని కిష్టారెడ్డి కాలనీలో శుక్రవారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక 3వ వార్డులో కిరాణం షాపు నిర్వహిస్తున్న మంజూల అనే మహిళ వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి వాటర్ బాటిల్ కావాలని అడిగారు.
ఆమె ఫ్రిజ్‌లో నుంచి బాటిల్ తీసి ఇచ్చే క్రమంలో, దుండగులు ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకుని పరారయ్యారు. బాధితురాలు వారిని వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.
