
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని నిత్యం లక్షల మందికి పైగా దర్శించుకుంటారు. అయితే రాజకీయాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధుల రికమండేషన్ లెటర్లను స్వీకరించవద్దని ఎన్నికల సంఘం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి TTD ఆలయాధికారులకు లెటర్ పంపింది. సిఫారసు లేఖలను అనుమతించక పోవడంతో అదనంగా నిత్యం పది వేల మందికిపైగా సామాన్యులకు తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తోంది. TTD ధర్మకర్తల మండలిలోని రాజకీయాలతో సంబంధం లేని నలుగురికి తప్ప ఇతరుల రికమండేషన్ లెటర్లకు టిక్కెట్లు జారీ చేయవద్దనే ఆదేశాలు అందాయి. రద్దీ ఎక్కువగా ఉండే వేసవి సెలవుల్లో తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారింది.