రైతుల ఓపికను పరీక్షించొద్దు.. డిమాండ్లను ఒప్పుకోండి

రైతుల ఓపికను పరీక్షించొద్దు.. డిమాండ్లను ఒప్పుకోండి

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. తమ ఓపికను పరీక్షించొద్దని, వెంటనే డిమాండ్లను అంగీకరించాలని ప్రభుత్వాన్ని సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరించింది. 

'రైతు ఉద్యమంలో ఇప్పటి దాకా 470 మంది అన్నదాతలు అమర వీరులయ్యారు. చాలా మంది ఆందోళనకారులు ఉద్యోగాలు, చదువు, పనులను వదిలేశారు. కానీ అన్నదాతల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సర్కార్ రైతుల బాగు కోరుకునేదే అయితే మా డిమాండ్లపై వెంటనే చర్చలు జరపాలి. వాటిని ఒప్పుకోవాలి' అని సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటనలో పేర్కొంది.