తిరుగులేని ఆన్​లైన్​ మార్కెట్​!

V6 Velugu Posted on Aug 18, 2021

  •  2030 నాటికి 40 బిలియన్‌‌‌‌ డాలర్లు
  •  వాల్యూ బయింగ్‌‌‌‌పై    జనం ఫోకస్‌‌‌‌
  •  లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ ప్రొడక్టులకు  ఫుల్లు గిరాకీ
  •  వెల్లడించిన కియర్నీ

బెంగళూరు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ కంపెనీలకు  వాల్యూ బయింగ్​ సెగ్మెంట్​లో భారీ అవకాశాలు ఉన్నాయని తాజా స్టడీ ఒకటి ప్రకటించింది. 2019 నాటికి ఈ సెగ్మెంట్‌‌‌‌ విలువ నాలుగు బిలియన్‌‌‌‌ డాలర్లు కాగా, 2030 నాటికి ఇది 40 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.98 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కన్సల్టెన్సీ కియర్నీ వెల్లడించింది. ‘వాల్యూ ఈ–కామర్స్‌‌‌‌: ది నెక్స్ట్‌‌‌‌ బిగ్‌‌‌‌ లీప్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఇండియాస్ రిటైల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌’ పేరుతో ఇది తయారు చేసిన రిపోర్టు ప్రకారం.. పల్లె, పట్టణ ప్రాంతాలతోపాటు టైర్‌‌‌‌–2, టైర్‌‌‌‌–3 సిటీల వాల్యూ బయింగ్​ కస్టమర్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మరింత షాపింగ్‌‌‌‌ చేస్తారు. తమ డబ్బుకు తగిన విలువ కలిగిన క్వాలిటీ లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ ప్రొడక్టుల (వాల్యూ బేస్డ్‌‌‌‌) కోసం వీళ్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్​ఫారాలవైపు చూస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ కంపెనీల వాల్యూ బయింగ్​ సెగ్మెంట్​ ఆదాయంలో 62 శాతం టైర్‌‌‌‌–2 సిటీల నుంచి రానుంది. డబ్బుకు తగిన విలువను ఇవ్వడంతోపాటు టాప్‌‌‌‌ క్వాలిటీ ప్రొడక్టు రావాలని కోరుకునే కస్టమర్ల కోసం కంపెనీలు కూడా బిజినెస్‌‌‌‌ మోడల్స్‌‌‌‌ను తీసుకొస్తున్నాయి. ఈ కేటగిరీ కస్టమర్లు ఏ ప్రొడక్టును కొన్నా ఎక్కువ డిస్కౌంట్లను ఆశిస్తారు. వస్తువు ధర తక్కువగా ఉంటేనే కొంటారు. బ్రాండ్స్‌‌‌‌పైన మోజు ఉన్నప్పటికీ, తమ ప్రైస్‌‌‌‌ సెగ్మెంట్లో వస్తుందంటే కొత్త కంపెనీల ప్రొడక్టులనూ కొనేందుకు ఇష్టపడతారు. ‘‘ఇండియాలో లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ కేటగిరీని గమనిస్తే  వాల్యూ రిటైలింగ్‌‌‌‌లో మనదేశ కంపెనీల వాటాయే ఎక్కువ. రిటైలింగ్‌‌‌‌ స్ట్రాటజీలో డిజిటల్‌‌‌‌, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌కు ఇంపార్టెన్స్‌‌‌‌ ఇవ్వడం తప్పనిసరిగా మారింది. వాల్యూ ఈ–కామర్స్‌‌‌‌కు అన్ని రకాల సెల్లర్స్‌‌‌‌కు ముఖ్యమైనది అవుతుంది. ఈ సెగ్మెంట్‌‌‌‌ రోజురోజుకూ పెరుగుతుంది’’ అని కియర్నీ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ సిద్ధార్థ్‌‌‌‌ జైన్‌‌‌‌ వివరించారు.  
లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ దూసుకెళ్తోంది..
దుస్తులు, కాస్మొటిక్స్‌‌‌‌, హోం అప్లియెన్సెస్‌‌‌‌ వంటి వాటిని లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ ప్రొడక్టులు అంటారు. ప్రస్తుతం ఇండియా లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ విలువ ఎనిమిది బిలియన్‌‌‌‌ డాలర్ల వరకు ఉంది. వీటిలో సగానికిపైగా వాల్యూ ప్రొడక్టులే ఉన్నాయి. ఇప్పటి ఈ–కామర్స్‌‌‌‌ షాపర్లలో 95శాతం మంది వాల్యూ ప్రొడక్టులు కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీరిలో 70 శాతం మంది మొదటి నుంచీ వాల్యూ–బయర్సే! ఇండియాలో వాల్యూ లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ రిటైల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ విలువ 2019లో 90 బిలియన్‌‌‌‌ డాలర్లు ఉండగా, ఇది 2030 నాటికి 215 బిలియన్‌‌‌‌ డాలర్లకు చేరుతుందని అంచనా. దుస్తులు, చెప్పులు, ఫ్యాషన్‌‌‌‌ యాక్సెసరీస్, కాస్మొటిక్స్‌‌‌‌, చిన్న హోం అప్లియెన్సెస్‌‌‌‌ భారీగా అమ్ముడవుతాయి. 2030 నాటికి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ విలువ 240 బిలియన్ డాలర్ల మార్క్‌‌‌‌ను అందుకనే అవకాశాలు ఉన్నాయి. ఇందులో లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ కేటగిరీ వాటాయే 75 బిలియన్‌‌‌‌ డాలర్ల దాకా ఉంటుంది. జనరల్‌‌‌‌, మోడర్న్‌‌‌‌, వాల్యూ ఈ–కామర్స్‌‌‌‌ చానెల్స్‌‌‌‌ అన్నీ వాల్యూ లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ రిటైల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ చేస్తున్నాయి. అందుకే వాల్యూ ఈ–కామర్స్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ 2019–2026 వరకు 26 శాతం సీఏజీఆర్ సాధిస్తుందని కియర్నీ రిపోర్టు వివరించింది. 

Tagged business, online, , Marketplace

Latest Videos

Subscribe Now

More News