
న్యూఢిల్లీ: వాల్వ్(రంధ్రం) మాస్కులు చాలా డేంజరని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్(డీజీహెచ్‌ఎస్) హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని ఈ మాస్కులు అడ్డుకోవని, ప్రమాదాన్ని ఇంకిత పెంచుతాయని చెప్పారు. వాల్వ్‌ఎన్95 మాస్కులు కరోనాను అడ్డుకుంటాయని ఇప్పటివరకు చెబుతూ వచ్చారని, కానీ ఇవి రిస్క్‌ను ఎక్కువ చేస్తాయని అన్నారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన లెటర్‌రాశారు. ఇంట్లో చేసిన బట్ట మాస్కులు వాడేలా జనానికి సూచనలు చేయాలన్నారు.
వాల్వ్ మాస్కులు ఎందుకు వాడొద్దు ?
ప్రస్తుత కొవిడ్19 టైమ్‌లో మనం మాస్కులు వాడుతున్నది మన నుంచి ఇతరులను కాపాడటానికి. రెండోది మనల్ని మనం కాపాడుకోవడానికి. కానీ ఎయిర్‌పొల్యూషన్ విషయంలోనై కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికే మాస్కు వాడతాం . ఈ వాల్వ్ మాస్కులు పొల్యూషన్ ఫిల్టర్ కోసం తయారు చేసినవి. బయటి నుంచి వచ్చేగాలిని ఫిల్టర్‌చేసి మనకు అందిస్తాయి. కానీ బయటకు వెళ్లే గాలిని ఫిల్టర్ చేయవు. వాల్వ్ మాస్కు పెట్టుకుంటే మనం వదిలే గాలి ఫిల్టర్ కాకుండానే రంధ్రం ద్వారా చాలా స్పీడ్‌గా బయటకు వెళ్లిపోతుంది. అలాంటి టైమ్‌లో ఆ మాస్కు పెట్టుకున్న వ్యక్తికి వైరస్ ఉంటే వాల్వ్ ద్వారా బయటకు వెళ్లి పక్కనున్న వాళ్లు కూడా ఇన్‌ఫెక్ అయే ప్రమాదం ఉంది. శాన్‌ఫ్రాన్‌సిస్కో గవర్నమెంట్ సహా ఇతర ప్రభుత్వాలూ వాల్వ్ మాస్కులు వాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.
అసలేంటీ వాల్వ్?
ఇదో ప్లాస్టిక్ డిస్క్. కాయిన్ సైజులో ఉంటుంది. మాస్కుకు ఓ వైపు సెట్ చేసి ఉంటుంది. మనం గాలి వదిలినప్పుడు ఆ ప్రెజర్‌కు డిస్క్ పైకి లేచి గాలి బయటకు పోతుంది.ఈ టైమ్‌లోనే వైరస్ కూడా బయటకు పోయే ప్రమాదముంది.
మరి మాస్కులు ఎట్లుండాలి?
1. వైరల్ ఫిల్టర్ ఎఫిషియెన్సీ (వీఎఫ్‌ఈ) 95శాతం ఉండాలి.
2.తయారీకి వాడిన మెటీరియల్‌తో శ్వాస తీసుకోవాడానికి ఇబ్బంది ఉండొద్దు.
3.ముఖానికి ఫిట్‌గా సెట్ అవ్వాలి. అలా లేకుంటే మాస్కు పెట్టుకున్నా వేస్టే.
ఎలాంటివి సేఫ్?
కాటన్ మాస్కులు సేఫ్ అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పింది. లేయర్లుగా సెట్ చేసుకొని కట్టుకున్న కాటన్ మాస్కులు వైరస్ ఉన్న తుంపర్లను లొపలికి రానివ్వవని, లోపలి నుంచి తుంపర్లను బయటకు వెళ్లనివ్వవని వివరించింది.
ఇంట్లో తయారు చేసినవి సేఫ్
ఇంట్లో తయారుచేసిన మాస్కులు వాడాలని మన ప్రభుత్వం ఇప్పటికే జనానికి సూచించింది. రోజూ మాస్కులను శుభ్రం చేసుకోవాలని, ఐదు నిమిషాలు వేడి నీటిలో ఉంచి తర్వాత ఎండబెట్టాలని సూచనలు జారీ చేసింది.
మూడు పొరలైతే బెస్ట్!
కాటన్, షిఫాన్ లేదా పాలిస్టర్‌లతో చేసిన 3 పొరల మాస్కులు సూక్ష్మకణాలను 80 నుంచి 99శాతం వరకు ఫిల్టర్ చేస్తున్నాయని అమెరికాలోని షికాగో వర్సిటీ సర్వే చేసి మరీ చెప్పింది. ఒక కాటన్ వస్త్రం, రెండు పాలిస్టర్ లేదా షిఫాన్ వస్త్రాలను మూడు పొరలుగా చేసుకొని వాడితే అది ఎన్95 మాస్క్‌తో సమానమని వివరించింది.
For More News..