డబ్బులకు, మద్యానికి ఓట్లు వేయొద్దు

డబ్బులకు, మద్యానికి ఓట్లు వేయొద్దు
  • మాజీ ఎంపీ విజయశాంతి

నాగార్జునసాగర్: డబ్బులు, మద్యానికి తమ విలువైన ఓట్లు వేయొద్దని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం చివరిదశలో ఉధృతంగా నిర్వహించిన ఆమె అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ప్రజలు కాంగ్రెస్, టీఆరెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు బిజెపి కి ఛాన్స్ ఇవ్వండి, ప్రజల మనుసుకు నచ్చేలా పనిచేస్తాం, మంచి పథకాలు తీసుకొస్తామని విజయశాంతి హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని ఆమె గుర్తు చేస్తూ.. పెద్దాయన జానారెడ్డి వయసైపోయిందని, జానారెడ్డి గెలిచినా లాభం లేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు.. మీ ఓటు వెస్ట్ చేసుకోకండని సూచించారు. మీరు గెలిపించిన కాంగ్రెస్  ఎమ్మెల్యేలను సంతలో బర్లను అమ్మినట్లు అమ్మిన్రు, వాళ్ల అవసరం కోసం 24 ఏళ్లు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి, తెలంగాణ వస్తే బాగుపడుతుందని అనుకున్నా, అంతా ఆగం అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పోడు భూముల సమస్య కూడా తీర్చలేదు, నిరుద్యోగ యువకులు , ప్రైవేట్ టీచర్లు , రైతులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు, 2014, 2018లో రెండు సార్లు అవకాశం ఇచ్చారు, కానీ కేసీఆర్ పాలన ప్రజా పక్షంగా లేదు, దోచుకోడానికే కేసీఆర్ పని చేస్తుండు, డబ్బులకు, మద్యం కోసం ఓటు వేయకండి అని విజయశాంతి కోరారు.