చల్ల చల్లగా ఐస్ క్రీం తినాలి అనిపించి.. ఓ డాక్టర్ తన చెల్లికి చెప్పాడు. అన్నయ్య చెప్పాడని.. ఆ చెల్లి.. తన అన్నయ్య కోసం ఆన్ లైన్ లో వెనీలా ప్లేవర్ ఐస్ క్రీంను ఆర్డర్ చేసింది. చెప్పిన టైంకి.. చేసిన ఆర్డర్ ఇంటికి వచ్చింది. దీంతో ఆ డాక్టర్.. ఐస్ క్రీం ఓపెన్ చేసి తింటున్నాడు.. అయితే ఆయనకు ఓ ముక్క కనిపించింది. దీనికితోడు తన కంటికి భిన్నంగా కనిపించింది. సహజంగానే డాక్టర్ అయిన ఆయన.. ఐస్ క్రీంలోని ఆ ముక్కను తీసి పరీక్షించాడు.. షాక్.. అది ఓ చేతి వేలు.. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశాడు.. ఈ స్టోరీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
ముంబైలోని మలాద్ ప్రాంతంలో బుధవారం నాడు చోటు చేసుకుంది ఈ ఘటన. ఆన్ లైన్ డెలివరీ యాప్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీం తెరిచి చూడగా చేతి వేలు దర్శనం ఇవ్వగా షాకైన సదరు డాక్టర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అతడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బుధవారం ఉదయం తన చెల్లి గ్రాసరీస్ ఆర్డర్ చేస్తుండగా తన కోసం మూడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేయమని కోరాడు. అన్న చెప్పినట్టుగానే చెల్లి ఆర్డర్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసింది.
ఐస్ క్రీం ఓపెన్ చేసి తింటుండగా చేతి వేలు కనపడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని నుండి ఫిర్యాదు అందుకున్న మలాద్ పోలీసులు ఆ వేలు ముక్కను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని తెలిపారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు.