కడుపులోకి వెళ్లిన ఈగ.. చక్కగా బతికే ఉంది

కడుపులోకి వెళ్లిన ఈగ.. చక్కగా బతికే ఉంది

చాలా సార్లు అనేక వింత కేసులు వెలుగులోకి వచ్చి ఆశ్చర్యం కలిగిస్తాయి. అదే సమయంలో కొన్ని కేసులు ఆలోచింపజేసేవిలా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక వింత కేసు ఒకటి చర్చనీయాంశమైంది. వాస్తవానికి  అమెరికాలోని మిస్సోరీకి చెందిన వ్యక్తి పేగులో ఓ ఈగ సందడి చేసింది. అది చూసి వైద్యులు షాక్ తిన్నారు. 

 63 ఏళ్ల వ్యక్తి తన పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంబంధించిన సాధారణ చెకప్ కోసం  ఆసుపత్రికి వెళ్లాడు. ఈ పరీక్షా విధానంలో పేగుల లోపల కెమెరాను ఉంచారు. అంతా బాగానే ఉందని గమనించారు. అయితే ఇంతలో అసాధారణమైన విషయం వైద్యుల కంట పడింది. ఆ వ్యక్తి పేగుల గోడపై బతికి ఉన్న ఈగ ఉంది.

మిస్సౌరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు రోగిని విచారించారు. ఈగ అతని ప్రేగులలోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈగ ఆ వృద్ధుడి శరీరంలోకి ఎలా ప్రవేశించిందో అతనికి కూడా తెలియదు. తనకు ఎలాంటి సమస్య లేదని ఆ వ్యక్తి చెప్పాడు.  అయితే అతను కోలనోస్కోపీకి ముందు జీర్ణవ్యవస్థ ఖాళీ ఉండే విధంగా ముందు రోజు డ్రింక్స్  మాత్రమే తీసుకున్నాడు. అయితే అతను తన 24 గంటల ఉపవాసానికి ముందు సాయంత్రం పిజ్జా, సలాడ్ తిన్నాడు. అయితే తాను తిన్న ఆహారంలో ఈగలు ఉన్నాయో లేదో తెలియదన్నాడు.

ఈగ అతడి పేగులోకి ఎలా వెళ్లిందన్న దానిపై మిస్సౌరీ విశ్వవిద్యాలయ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ చీఫ్ మాథ్యూ బెచ్ టోల్డ్ వాళ్లు రెండు సిద్దాంతాలను కనిపెట్టారు. ఈగ మనిషి నోటి ద్వారా పెద్ద ప్రేగులకు ఎలా చేరుకొని ఉంటుందనే దానిపై వివరణ ఇస్తూ. . సాధారణ పరిస్థితుల్లో అయితే ఎగువ జీర్ణ ఎంజైములు పొట్టలోని ఆమ్ల ఈగని జీర్ణం చేసుకొని ఉండాలి. కానీ అలా జరగలేదు. కనుక నోటి ద్వారా మాత్రం ఈగ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు.

 రెండో సిద్దాంతం ప్రకారంగా .. పురీషనాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చివరగా ఈ సిద్దాంతం కూడా తప్పేనని తెలిసింది. దిగువ భాగం నుంచి పెద్దపేగులోకి ఈగ చొచ్చుకొనిపోవడం అనేది అసాధ్యం అని తెలుసు. ఎందుకంటే ఈగ లోపల ఉన్నా పెద్దపేగులోకి వెళ్లాలంటే ఆ నాళం పొడవుగా తెరుచుకొని ఉండాలి. కానీ పెద్దపేగు మాత్రం మధ్యలో ముడుచుకొని వంకరగా ఉంటుంది. కనుక ఈ సిద్దాంతం కూడా తప్పే అని నిర్దారణ అయ్యింది.

జీర్ణవ్యవస్థలో కీటకాలు చెక్కుచెదరకుండా ఉండి గుడ్లు లేదంటే లార్వాలను జీర్ణాశయాంతర పేగులలో ఉంచి పేగు మయాసిస్ కు కారణమయ్యే సందర్బాలు గతంలోను అరుదుగా చోటు చేసుకున్నాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేర్కొంది. పిన్‌వార్మ్, సీట్‌వార్మ్, థ్రెడ్‌వార్మ్ వంటి పరాన్న జీవులు పేగులను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నప్పటికీ పేగుల్లో జీర్ణం కాని ఈగను గుర్తించడం ఇదే మొదటిసారి. ఈగ మనిషి పెద్దపేగులోకి ఎలా ప్రవేశించి ఉంటుదని.. ఆ ఈగ కోసం చేసిన సిద్దాంతాలన్నీ తప్పు కావడంతో మరి అది ఎలా ప్రవేశించిందన్నది శాస్త్రవేత్తలకు పెద్ద మిస్టరీగా మారింది