ఆమె కడుపులో రెండున్నర కేజీల వెంట్రుకలు: ప్రెగ్నెన్సీ టైంలో ఏ చేసిందంటే..

ఆమె కడుపులో రెండున్నర కేజీల వెంట్రుకలు: ప్రెగ్నెన్సీ టైంలో ఏ చేసిందంటే..

కొంతమంది స్త్రీలకు గర్భం దాల్చినప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి. మరికొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో వింత అలవాట్లు చేసుకుంటారు. మట్టి, సున్నం తినడం, ఎక్కువగా ఆలోచించడం లాంటివి.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్‌లో  ఓ గర్భిణీ చేసిన పనికి డాక్టర్లే షాక్ అయ్యారు. 25ఏళ్ల వివాహిత గర్భం దాచ్చినప్పుడు వెంట్రుకలు తినే అలవాటు చేసుకుంది. అలా రహస్యంగా ఆమె వెంట్రుకలకే కాదు. ఇతరుల వెంట్రుకలు కూడా తినేది. డెలివరీ అయ్యాక ఆమె ఆ అలవాటు మానేసింది. అయితే.. అంతా నార్మల్‪గా ఉంది అనుకున్న టైంలో ఆమెకు విపరీతమైన కడుపునొప్పితో ఏమి తినలేకపోవడం, వాంతులు అయ్యాయి. 

దీంతో ఆమెను కుటుంబసభ్యులు హాస్పిటల్‪కు తీసుకెళ్లారు. మందులు వాడినా తగ్గలేదు. ఈసారి ఓ చిత్రకూట్‪లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేస్తే ఆమె కడుపులో జుట్టు ఉన్నట్లు గుర్తించారు. 45నిమిషాలపాటు ఆపరేషన్ చేసి డాక్టర్లు ఆమె కడుపు నుంచి రెండున్నర కేజీల వెంట్రుకలను తీశారు. మహిళ ట్రైకోఫాగియా అనే అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతుందని డాక్టర్ తెలిపాడు. ఆ పరిస్థితిలో మాటిమాటికి తినడం, వాసన పీల్చడం, వెంట్రుకలు తినడం వంటివి చేస్తుంటారని చెప్పారు. టైంకు ఆపరేషన్ చేయడం వల్ల ప్రాణాలతో బయటపడిందని, లేదంటే పరిస్థితి విషమించి చనిపోయేదని డాక్టర్లు అంటున్నారు.