
నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ కు ప్రసవం చేశారు వైద్య సిబ్బంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు చెందిన గర్భిణిని డెలివరీ కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. గర్భిణికి కరోనా టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో పీపీఈ కిట్ ధరించి డెలివరీ చేశారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. డెలివరి సమయంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.