డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ చిందులు 

డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ చిందులు 

విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో చిందులు వేశాడు. రెండో వన్డేలో సౌతాఫ్రికాపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ను అభినంధిస్తూ తన చేతులతో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. విరాట్ డ్యాన్స్ చేస్తుండగా పక్కనే ఉన్న శిఖర్ ధావన్ నవ్వుతూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఎలాంటి భయం లేకుండా సఫారీల బౌలర్లకు చుక్కులు చూపిస్తూ బౌండరీలు, సిక్సర్ల తో విరుచుకుపడిన పంత్ బ్యాటింగ్ కు విరాట్ ఫిదా అయ్యాడు. కోహ్లీ రెండో వన్డేలో నిరాశపరిచాడు. కానీ పంత్ విధ్వంసకమరమైన బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. అందుకే పంత్ బౌండరీలు బాదుతుంటే విరాట్ డ్యాన్స్ చేస్తూ ఎంకరేజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరిన్ని వార్తల కోసం

సెమీస్ కు సింధు..ప్రణయ్ ఔట్

చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటున్న డేవిడ్ భాయ్