చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటున్న డేవిడ్ భాయ్

చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటున్న డేవిడ్ భాయ్

ఈతరం విదేశీ క్రికెటర్లలో డేవిడ్ వార్నర్ ను చాలా మంది భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా తెలుగు అభిమానుల్లో వార్నర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అతడ్ని డేవిడ్ భాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు తెలుగువాళ్లు. అందుకు తగ్గట్లే తెలుగు సినిమాల్లో పాపులర్ డైలాగులు, డ్యాన్స్ వీడియోలకు స్పూఫ్ లు చేస్తూ సంతోషపరుస్తుంటాడు వార్నర్. ఈ క్రమంలో పాన్ ఇండియా హిట్ ‘పుష్ప’ మూవీలోని శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ చేసిన స్టెప్ ను డేవిడ్ భాయ్ అచ్చం దింపేశాడు. చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటూ వార్నర్ చేసిన స్టెప్స్ కు సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ వస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, వార్నర్ క్రేజీ డ్యాన్స్ మూవ్స్ ను మీరూ చూసేయండి..

మరిన్ని వార్తల కోసం:

తల్లయిన స్టార్ హీరోయిన్!

మామయ్య బ్లెస్సింగ్స్ తీస్కున్నా