సెమీస్ కు సింధు..ప్రణయ్ ఔట్
V6 Velugu Posted on Jan 22, 2022
లక్నో: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్‌కు దగ్గరైంది. మెగా టోర్నీలో ఆమె సెమీఫైనల్‌కు చేరుకోగా.. మరో సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్స్‌లోనే వైదొలిగాడు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ సింధు 11–21, 21–12, 21–17తో ఆరో సీడ్ సుపానిద క్యాటెతింగ్ (థాయ్‌లాండ్)పై పోరాడి గెలిచింది. 65 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఫస్ట్ గేమ్ కోల్పోయినా వెంటనే కమ్‌బ్యాక్ చేసి నెగ్గింది. మరో క్వార్టర్స్‌లో మాళవిక 21–11, 21–11తో ఆకర్షి కష్యప్‌పై గెలిచింది. ఇక, మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ ప్రణయ్ 19–21, 16–21తో ఫ్రాన్స్‌కు చెందిన అన్‌సీడెడ్ అర్నాడ్ మోర్కెల్ చేతిలో వరుస గేమ్స్‌లో ఓడిపోయాడు. అయితే, మరో క్వార్టర్స్‌లో ఇండియాకే చెందిన మిథున్ మంజునాథ్ 11–-21, 21–-12, 21-–18తో సెర్గే సిరాంత్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరాడు.
Tagged PV Sindhu, semis, Syed Modi International, HS Prannoy Crashes