5 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

5 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల నగరంలో వరుసగా వీధి కుక్కల దాడి ఘటనలు జరుగుతున్నాయి. మార్చి 26వ తేది ఆదివారం మరో ఘటన జరిగింది. గోల్కొండ ప్రాంతంలోని లక్ష్మి నగర్ బస్తీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ 5ఏళ్ల బాలుడుపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు కుడి చేయిపై కరిచి తీవ్రంగా గాయపరిచాయి. వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ బాబు పెద్దగా కేకలు వేశాడు.. దీంతో అప్రమత్తమైన స్థానికులు బాబుని కాపాడారు. బాబుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. 

బలుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మీ నగర్ బస్తీలో వీధి కుక్కలు బెడద అధికంగా ఉందని జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తరుచూ ఈ బస్తీలో వీధి కుక్కలు స్థానికులను హడలెత్తిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.