
ఎనిమిదేళ్ల క్రితం ‘కార్తికేయ’ చిత్రంతో హిట్ అందుకున్న నిఖిల్.. ఇప్పుడు ‘కార్తికేయ 2’తో వస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ రేపు రిలీజవుతున్న సందర్భంగా ఇలా ముచ్చటించాడు. ‘‘కార్తికేయ వచ్చిన రెండేళ్లకి శ్రీలంకలో చందు నాకీ స్టోరీ చెప్పాడు. ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో కథ, మాటలు బాగా రాశాడు. ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి అడ్వెంచర్స్ చేసే కార్తీక్ క్యారెక్టర్ నాది. ఫుల్ టైమ్ డాక్టర్‌గా, పార్ట్ టైమ్ డిటెక్టివ్‌గా కనిపిస్తాను. దేవుడు ఉన్నాడా లేడా అని సందేహపడేవారికి కన్విన్సింగ్‌గా సైంటిఫిక్ ఆన్సర్ ఇచ్చాం. నా దృష్టిలో మనకి మంచి చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. లైఫ్ ఇచ్చిన శేఖర్ కమ్ముల నాకు గాడ్. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ ఎవరో ఒకరు ఉంటారు. నేనింతవరకు లవ్, రొమాన్స్, కామెడీ చేశాను కానీ భక్తి సినిమాలు చేయలేదు. ఇందులో అన్ని మతాల వారినీ గౌరవిస్తూ ఓ సీన్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా కొత్తగా కనబడబోతోంది.
లెజెండరీ యాక్టర్ కావడంతో అనుపమ్ ఖేర్ గారితో కొన్ని సీన్స్ చేసేప్పుడు భయమేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది శ్రీకృష్ణుడిని ఇష్టపడతారు. అందుకే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకున్నాం. అరబిక్, ఇంగ్లిష్‌లో కూడా డబ్ చేస్తున్నాం. నాకు టిన్ టిన్ బుక్స్ అంటే చాలా ఇష్టం. చందుకి కూడా. వాటిలోని రహస్యాల ఆధారంగా ఫ్రాంచైజీ తీద్దామనుకున్నాం. ఫస్ట్ పార్ట్‌లో సుబ్రహ్మణ్య స్వామి గుడి గురించి, ఇప్పుడు ద్వారక గురించి తీశాం. ఫ్యూచర్‌లో ఇండియన్ గ్రేట్‌నెస్ చూపించే మరిన్ని కథలు తీస్తాం. రెండున్నరేళ్ల తర్వాత థియేటర్స్‌కి వస్తున్నా. నేను చేసే సినిమాలన్నీ థియేటర్స్‌లో చూసేవే. ‘18 పేజెస్’ పది రోజులు, ‘స్పై’ ముప్ఫై రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. ఇవీ ఈ ఏడాదే రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. సుధీర్ వర్మతోనూ ఓ సినిమా చేస్తున్నాను. మరో రెండు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. మంచి కథ వస్తే వెబ్ సిరీస్‌కి కూడా రెడీ.’’