- గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్‌ను మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధి ప్రజల కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వారి సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని సోమవారం లోక్ భవన్ లో గవర్నర్ ప్రారంభించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తితో ఈ వాహనాన్ని సమకూర్చారు. గవర్నర్ మాట్లాడుతూ.. వాహన సేవలను మెదక్ ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.
