
పాక్ ఉగ్రస్థావరాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ఇండియా టెర్రిరిజంపై ఎంతో కాలంగా పోరాడుతున్నారని అన్నారు. ఈ పోరాటం త్వరగా ముగిసిపోవాలి. ఇది చాలా బాధాకరం. అక్కడి ప్రజలకు ఏదో జరగబోతుందని ముందే తెలుసు. భారత్, పాకిస్తాన్ దేశాలకు ఎంతో చరిత్ర ఉంది. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి..యుద్ధం కాదు. ఈ పోరాటం త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నాను అని ట్రంప్ అన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రికి దోవల్ ఫోన్
పాక్ టెర్రర్ క్యాంపులపై దాడులు ప్రారంభించిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఫోన్ లో మాట్లాడారు. టెర్రర్ క్యాంపులపై చేపట్టిన దాడుల గురించి ఆయన వివరించారని వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.
మరో వైపు పాకిస్తాన్‌పై ఇండియా దాడులు కొనసాగుతున్నాయి.. ఆపరేషన్ సిందూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేస్తోంది. మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. మరో వైపు బదులు తీర్చుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది.