విమానం దిగుతూ తడబడిన ట్రంప్.. ఆరోగ్యంపై మరోసారి చర్చ

విమానం దిగుతూ తడబడిన ట్రంప్.. ఆరోగ్యంపై మరోసారి చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెల్త్ పై మరోసారిచర్చ ప్రారంభమైంది. ఎయిర్ ఫోర్స్ వన్ లో ఆయన ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకు ని విమానం దిగుతూ కన్పించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడు తున్నాయి. 

కాగా.. దీనికి ముందు రోజు ఓ కా ర్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా తాజాగా వైరల్ అవుతుంది. అందులో ట్రంప్ కుర్చీలో కూర్చునేందుకు ఇబ్బంది పడినట్లు గా కన్పిస్తోంది. ఈ వీడియోలపై కొందరు నెగెటివ్ కామెంట్లు పెడుతుండగా.. మరికొం దరు ఇది సాధారణమైన విషయమేనని కొట్టి పారేస్తున్నారు.