లక్షల జీతం.. కానీ ఏం లాభం.. జీవితంపై విరక్తితో చనిపోయాడు: హీలియం వాయువు పీల్చి CA సూసైడ్

లక్షల జీతం.. కానీ ఏం లాభం.. జీవితంపై విరక్తితో చనిపోయాడు: హీలియం వాయువు పీల్చి CA సూసైడ్

న్యూఢిల్లీ: చార్టెడ్ అకౌంట్ (సీఏ) వంటి ఉన్నత చదువులు చదివాడు. నెలకు లక్షల జీతం వచ్చే జాబ్. కానీ జీవితంపై విరక్తి రావడంతో హీలియం వాయువు పీల్చి సూసైడ్ చేసుకున్నాడు ఓ చార్టర్డ్ అకౌంటెంట్. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 25 ఏళ్ల ధీరజ్ కన్సల్ అనే యువకుడు గురుగ్రామ్‎లోని ఓ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్‎గా పని చేస్తున్నాడు. 2025, జూలై 20న ఢిల్లీలోని ఓ హోటల్‎లో ధీరజ్ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. జూలై 28వ తేదీన హోటల్ రూమ్ చెకౌట్ చేయాల్సి ఉంది. 

కానీ రూమ్ నుంచి ఎంతకు బయటకు రాకపోవడం, గది నుంచి దుర్వాసన వస్తుండటంతో హోటల్ సిబ్బంది అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగా ధీరజ్ విగతజీవిగా పడి ఉన్నాడు. గదిలో హీలియం వాయువుకు సంబంధించిన ఆనవాళ్లు లభించడంతో.. ధీరజ్ హీలియం వాయువు పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. రూమ్ నుంచి సూసైడ్ లెటర్‎ను కూడా పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్యకు ముందు కూడా ధీరజ్ సోషల్ మీడియా వేదికగా కూడా సూసైట్ నోట్ షేర్ చేశాడు. ‘నాకు మరణం జీవితంలో అత్యంత అందమైన భాగం. దయచేసి నా మరణం గురించి ఎవరూ బాధపడకండి. ఆత్మహత్య తప్పు కాదు ఎందుకంటే నాకు నాపై ఎటువంటి బాధ్యతలు లేవు. నా మరణానికి ఎవరూ కారణం కాదు. నా జీవితంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించారు. నా మరణం వల్ల ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని పోలీసులు, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’’ అని పోస్ట్ పెట్టాడు.

మృతుడి ధీరజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘజియాబాద్‌లోని ఒక ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి ధీరజ్ హీలియం వాయువు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధీరజ్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తల్లి వేరే పెళ్లిచేసుకోవడంతో అతడు తాత, మామల దగ్గర పెరిగాడని వెల్లడించారు. జీవితంపై విరక్తి వచ్చే సూసైడ్ చేసుకున్నాడా లేక మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.