చైల్డ్ యాక్టివిస్ట్ లిసిప్రియా ట్వీట్
వాతావరణ మార్పుల ప్రభావంపై పోరాడుతున్న బాలిక గ్రెటా థన్‌బర్గ్ తెలుసుకదా. ఆమెలానే ఇండియాలోని మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజమ్ (8 ఏళ్లు) కూడా క్లైమేట్ చేంజ్‌పై పోరాటం చేస్తోంది. ఈ మధ్య కాప్-25 లోనూ మాట్లాడి అర్జెంటుగా నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. దీంతో పత్రికలు ఆమెను ఇండియన్ గ్రెటాగా పొగిడాయి. కానీ తనను ఆ పేరుతో పిలవొద్దని రెండ్రోజుల కిందట లిసిప్రియా ట్వీట్ చేసింది. ‘మా ఇద్దరి గోల్స్ ఒక్కటే. మాకు స్ఫూర్తినిచ్చిన వాళ్లలో తను ఒకరు. కానీ నాకంటూ ప్రత్యేకంగా ఓ స్టోరీ ఉంది. ఐడెంటిటీ ఉంది. గ్రెటా కన్నా ముందే 2018 జులై నుంచే నేను ఉద్యమం స్టార్ట్ చేశా’ అని ట్వీట్ చేసింది. తొలిసారి 2018 జులై 4న మంగోలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడానని గుర్తు చేసింది. ‘నన్ను ఇండియన్ గ్రెటా అని పిలిస్తే నా స్టోరీని మీరు కవర్ చేసినట్టు కాదు. తొలగించినట్టు’ అని పేర్కొంది. వాతావరణ మార్పులపై పార్లమెంటులో చట్టం చేయాలంటూ ‘బచ్పన్ ఆందోళన్’ను లిసిప్రియా స్టార్ట్ చేశారు.