స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. 2010 లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐదుగురు సభ్యులరాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా గతంలోని పర్సెంటేజ్ ను తగ్గించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2010 లో తీర్పు టైమ్‌లో బీసీ జనగణన డేటా లేదని, ఇప్పుడు ఆ డేటా అంతా ఉందని పిటిషనర్ చెప్పగా కోర్టు ఆ వాదనలను తోసిపుచ్చింది.
