రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు

రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు

చెన్నై: రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అనారోగ్య కారణాలతో పొలిటికల్ ఎంట్రీపై వెనక్కి తగ్గిన రజనీ.. మరోమారు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ‘సాధారణ వైద్య పరీక్షల కోసం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చా. సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా గత కొంతకాలం నుంచి మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయా. ఈ క్రమంలోనే నేడు నిర్వాహకులందరితో సమావేశమయ్యా. వాళ్లందరికీ నా రాజకీయ అరంగేట్రంపై ఎన్నో సందేహాలున్నాయి. నాకు రాజకీయాల్లోకి రావాలని లేదు. భవిష్యత్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ప్లాన్స్ అస్సలు లేవు’ అని రజనీ క్లారిటీ ఇచ్చారు. 

రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తలైవా.. దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ఫ్యాన్స్ అసోసియేషన్‌ కార్యక్రమాలను కొనసాగిస్తారని చెప్పారు. కాగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని 2017లో నిర్ణయించుకున్న తలైవా.. గతేడాది అనారోగ్య కారణాలతో వెనక్కి తగ్గారు. రాజకీయాల్లో లేకున్నా ప్రజలకు సేవలు చేస్తానని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తన ఫ్యాన్స్‌‌తోపాటు తనపై నమ్మకం పెట్టుకున్న వారిని నిరాశపరుస్తుందని, కాబట్టి తనను క్షమించాలని ఓ ప్రకటనలో రజనీ కోరారు.