ఇలాంటి వీడియోలు వైరల్ చేయొద్దు...

ఇలాంటి వీడియోలు వైరల్ చేయొద్దు...
  • సమాజానికి మంచిది కాదు: సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ 
     

హైదరాబాద్: ఫలక్ నుమా.. పాతబస్తీ డబిర్ పురా స్ట్రీట్ ఫైట్.. సీసీ కెమెరా విజువల్స్ వైరల్ చేయొద్దని సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ కోరారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకున్న ఘటనలపై ఆయన స్పందించి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 
పాతబస్తీలో ఈనెల 6న ఫలక్ నుమా లో అబ్దుల్ షారుక్ హత్య కేసులో నిందితుడు సయ్యద్ అన్వర్ ను అరెస్ట్ చేశామని, అలాగే డబిర్ పురా స్ట్రీట్ ఫైట్ కేసులో ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ ఆరుగురిలో ఇద్దరు జువెనైల్ ఉన్నారని ఆయన తెలిపారు. 
పథకం ప్రకారమే షారుక్ హత్య
‘‘షారుక్ అనే యువకుడు సయ్యద్ అన్వర్ కూతుర్ని ప్రేమించాడు.. గతంలోనే అబ్దుల్ షారుక్ కు పెళ్లి అయింది.. మృతుడు షారుక్ గతంలో అన్వర్ కూతుర్ని  పెడ్లి పేరుతో వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు.. సయ్యద్ అన్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అబ్దుల్ షారుక్ ను అరెస్ట్ చేశాము.. అయితే జైలుకు వెళ్ళిన అబ్దుల్ షారుక్ బెయిల్ పై బయటకు రాగానే  మైనర్ అయిన అన్వర్ కూతుర్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు..ఇది మనసులో పెట్టుకున్న అన్వర్ మృతుడు అబ్దుల్ షారుక్ ను ఇంటికి పిలిచి మాట్లాడాలని ప్లాన్ వేసాడు.. అమ్మాయి తండ్రి ఆన్వర్ స్వయంగా పిలవడంతో.. రాజీకి వచ్చాడని భావించిన అబ్దుల్ షారుక్ ఏ మాత్రం అనుమానించకుండా  బైక్ పై వెనుక కూర్చొబెట్టుకుని బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలోనే అన్వర్ షారుక్ మెడను కోసి హత్య చేశాడు.. ఈ కేసులో నిందితుడు అన్వర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాము..’’ అని సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ వివరించారు. 
దబిర్ పురా  స్ట్రీట్ ఫైట్ కేసులో యువకులందరూ 20 ఏళ్లలోపు వారే
డబిర్ పురా లో శనివారం కొంత మంది యువకులు గుమికూడి పరస్పరం వాగ్వాదం చేసుకని దాడి చేసుకున్నారు.. ఇందులో యువకులు అందరూ 20 సంవత్సరాల లోపు వారే ఉన్నారు.. కమ్రాన్ అనే యువకుడు అద్నాన్ అనే వ్యక్తి నీ బలంగా తలపై కొట్టాడు.. దీంతో అద్నాన్ కుప్పకూలిపోయాడు.. అద్నాన్ ను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు..
ఆరుగురు స్నేహితులు మధ్య గొడవ చోటుచేసుకుంది
ఆరుగురి స్నేహితుల మధ్య గొడవ చోటు చేసుకుంది. వీళ్లలో వీరికి తగాదా వచ్చి అద్నాన్ అనే యువకున్ని వేధించారు.. అద్నాన్ ను మిగతా స్నేహితులు చేత కానివాడు.. అని అనడంతో ఈ గొడవ జరిగింది.. ఈ కేసులో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నాము. ఇందులో ఇద్దరు జ్యువైనల్ వున్నారు. రెండు కేసుల్లో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నేరస్తులను పట్టుకున్నాము.. మీడియా లో విస్తృత ప్రచారం జరిగితే నేరానికి శిక్ష పడడం కష్టం.. సీసీ ఫుటేజ్ వుంటే మీడియా సంయమనం పాటించాలి..’’ అని డీసీపీ గజరావు భూపాల్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సీసీ ఫుటేజ్ వైరల్ చేయవద్దు సమాజానికి మంచిది కాదు.. అని ఆయన తెలిపారు.