ప్రభుత్వం పెన్షనర్లను నిర్లక్ష్యం చేయొద్దు

ప్రభుత్వం  పెన్షనర్లను  నిర్లక్ష్యం చేయొద్దు

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తుందని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మండిపడింది. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ముందుగా గద్దర్, జహీర్ అలీఖాన్, లక్ష్మారెడ్డి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎ. రాజేంద్ర బాబు, ఎంవీ నర్సింగ్ రావు మాట్లాడుతూ.. ప్రతినెల ఫస్ట్ తారీఖున పింఛన్ డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

వెంటనే పెండింగ్​ కరువు భత్యం వాయిదాల విడుదల, పీఆర్ సీని ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ – కుబేర్ లోని అన్ని బిల్లులను తక్షణమే పరిష్కరించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు నారాయణ రావు, వీరస్వామి, నరసయ్య, దేశ్ పాండే, జయశ్రీ పాల్గొన్నారు.