
మాంచెస్టర్: టీమిండియా చేతిలో ఓడిపోయినందుకు బాధగా ఉన్నా.. అసభ్య పదజాలంతో తమను తిట్టొద్దని పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిమానులను వేడుకున్నాడు. తమ ప్రదర్శనపై ఎంతైనా విమర్శలు చేయండన్నాడు. ‘దయచేసి మమ్ముల్ని తిట్టడానికి బ్యాడ్‌వర్డ్స్‌ను మాత్రం ఉపయోగించొద్దు. మేం సరిగా ఆడలేదని ఎంతైనా విమర్శించండి. ఒప్పుకుంటాం. కానీ చెడ్డ మాటలతో మా మనసులను గాయపర్చకండి.
రాబోయే మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా ఆడతాం. ఇందుకు మీ మద్దతు చాలా అవసరం’ అని ఆమిర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో సరిగా ఆడకపోతే స్వదేశంలో ఎదురయ్యే విమర్శలను పేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సహచరులను హెచ్చరించాడు. ఇండియాతో మ్యాచ్‌లో ఓడినా.. మిగతా వాటిలో రాణించాలన్నాడు.