ట్రాక్టర్ ర్యాలీ హింస కేసులో మేం జోక్యం చేసుకోం

ట్రాక్టర్ ర్యాలీ హింస కేసులో మేం జోక్యం చేసుకోం

న్యూఢిల్లీ: రిపబ్లికే డే నాడు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ కేసులో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది. దాఖలైన పిటిషన్‌లను చీఫ్ జస్టిస్ ఎస్‌‌ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రహ్మణియన్‌‌ల ధర్మాసనం కొట్టేసింది.

ఏ ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా చిత్రించొద్దని మీడియాపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ విషయంలో ప్రభుత్వం విచారణ జరుపుతోందని మేం భావిస్తున్నాం. చట్టం తన పని తాను చేస్తోందని చెబుతూ ప్రధాని ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ను మేం చదివాం. ఈ కేసు విషయంలో మేం తలదూర్చాలని అనుకోవడం లేదు’ అని బోబ్డే స్పష్టం చేశారు.