నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు విస్తరించాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు  విస్తరించాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు : నర్సంపేట ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రిలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి, వైద్య సేవలను విస్తరించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. నర్సంపేట ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి అభివృద్ది సొసైటీ కమిటీ సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన శనివారం జరిగింది.

సమావేశానికి మహబూబాబాద్​ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ కలెక్టర్​ సత్యశారద హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ జనరల్ ఆస్పత్రికి కావాల్సిన సౌకర్యాలు, వసతులను కల్పిస్తామని చెప్పారు. ఆస్పత్రి సూపరిండెంట్ కిషన్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.