దూరదర్శన్ ఛానల్ పై కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన ది కేరళ స్టోరీ మూవీని దూరదర్శన్ లో ప్రసారం చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ ఆర్ఎస్ ఎస్ లకు దూరదర్శన్ ప్రచార యంత్రంగా మారకూడదన్నారు. లోక్ సభ ఎన్నికల ముందు మత ఘర్షణలకు దారితీస్తుందని ..మూవీని టెలికాస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు ఇలాటి దుర్దుదేశ పూరితమైన కుట్రలకు అడ్డుకోవడానికి కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేరళలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందందటూ సీపీఐ విమర్శలు చేసింది.
మరో వైపు ఇవాళ(ఏప్రిల్ 5) కేరళ స్టోరీ దూరదర్శన్ లో టెలికాస్ట్ కానుంది. సుదీప్తో సేన్ డైరెక్షన్ లో వచ్చిన ది కేరళ స్టోరీలో నటి ఆదాశర్మ కీ రోల్ లో నటించారు. 2023 మే 5న రిలీజ్ అయ్యింది. హిజాబ్,లవ్ జిహాద్ ల చుట్టూ తిరిగే ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య బాక్సాఫీస్ దగ్గర విజయం అందుకుంది. భారీగా కలెక్షన్లు వచ్చాయి. మళ్లీ ఇపుడు వివాదాస్పదంగా మారింది.