హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి దోస్త్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. రెండు విడతల్లో ఈ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. తొలి విడతలో ప్రభుత్వ, యూనివర్సిటీ, ఎయిడెడ్ కాలేజీల్లోని రెగ్యులర్ కోర్సుల ఖాళీలను ఈ నెల 23న నోటీస్ బోర్డులు, వెబ్సైట్లలో ప్రదర్శిస్తారు.
24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను సెప్టెంబర్ 26లోగా దోస్త్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. రెండో విడతలో భాగంగా సెప్టెంబర్ 28, 29 నసీట్ల భర్తీకి ‘వన్‌టైమ్ స్పెషల్ స్పాట్ రౌండ్’ నిర్వహిస్తారు. కాలేజీలు సెప్టెంబర్ 30లోగా అడ్మిషన్ల వివరాలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.425 కాలేజీలో చెల్లించాలి. స్పాట్ అడ్మిషన్ల విద్యార్థులకు రీయింబర్స్మెంట్ వర్తించదు.
