- ఇప్పటిదాకా 96 వేల అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియనున్నది. ఇప్పటివరకూ 96,652 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు.
వీరిలో 60,726 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు. శనివారంతో రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ముగియనున్నదని, అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆదివారంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ముగుస్తుందన్నారు. ఈ నెల 16న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఉంటుందని లింబాద్రి పేర్కొన్నారు.

