
హైదరాబాద్, వెలుగు: దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గడువును పొడిగించినట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ షెడ్యూల్ అడ్మిషన్ల గడువు 2వ తేదీతోనే ముగిసిందని.. కానీ, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 5 వరకు అవకాశం కల్పించామని చెప్పారు.
కాగా వెబ్ ఆప్షన్లకు కూడా 5వ తేదీ వరకే అవకాశం ఇచ్చారు. ఈ నెల 7న స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్ మెంట్ చేపట్టనున్నారు. సీటు పొందిన విద్యార్థులు 8, 9 తేదీల్లో ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో కాలేజీలకు విద్యార్థులు స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సూచించారు.