కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి వెళ్తే అరెస్ట్ దేనికి : భట్టి విక్రమార్క

 కాళేశ్వరం  ప్రాజెక్టును చూడటానికి  వెళ్తే అరెస్ట్ దేనికి : భట్టి విక్రమార్క

కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల్ని ప్రాజెక్టును ఎందుకు చూడనివ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాళేశ్వరం చూసేందుకు వెళ్లే వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టును చూడటానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకొవడం ఎందుకని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదన్న భట్టి.. పేదలకిచ్చే డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇచ్చే స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు వెంటనే పరిష్కారించాలని భట్టి డిమాండ్ చేశారు.  

యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో భద్రాద్రిలో మాత్రమే ఉత్పత్తి ప్రారంభమైందని, యాదాద్రి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని భట్టి విమర్శించారు. 24గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే గానీ గ్రామాల్లో కరెంటు సరఫరా సరిగ్గా జరగడం లేదని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ కార్డు రాష్ట్రంలో ఎక్కడా పనిచేయడం లేదన్న భట్టి.. ప్రైవేట్ ఆసుపత్రులలో విచ్చలవిడిగా బిల్లులు వేయడాన్ని ప్రభుత్వం కట్టడి చేయాలని సూచించారు.