Double Engine OTT: రెండు తలల పాము కథ.. OTTలోకి డబుల్ ఇంజిన్ మూవీ

Double Engine OTT: రెండు తలల పాము కథ.. OTTలోకి డబుల్ ఇంజిన్ మూవీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన మూవీ డబుల్ ఇంజిన్(Double Engine). రోహిత్ పెనుమాత్స(Rohit Penumatsa) ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో ఫిదా ఫేమ్ గాయత్రీ గుప్తా(Gayathri Gupta) ప్రధాన పాత్రలో కనిపించగా.. ముని, అజిత్ కుమార్‌, రోహిత్ న‌ర‌సింహ‌, రాజు కీ రోల్స్ చేశారు. పక్కా తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమా టిజర్, ట్రైలర్ తో మెప్పించగా.. జనవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజజీవితం సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అంతగా రెస్పాన్స్ రాలేదు. 

కారణం ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. దాంతో.. ఈ సినిమా గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. దాంతో థియేటర్స్ లో ప్లాప్ టాక్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా మార్చ్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్స్ లో అంతగా అలరించని డబుల్ ఇంజిన్ మూవీకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇక డబుల్ ఇంజిన్ సినిమా కథ గురించి చెప్పాలంటే.. హైదరాబాద్ నుండి స్నేహితుడిని కలవడానికి పెల్లెటూరికి వెళ్తాడు ఒక యువకుడు.  అక్కడ మిగతా స్నేహితులతో కలిసి రెండు తలల పామును పట్టుకొని, దాన్ని అమ్మి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. మరి వారికి రెండు తలల పాము దొరికిందా? దాని కోసం వారు పడ్డ కష్టాలు ఏంటి? చివరికి తాము అనుకున్నట్లుగా డబ్బులు సంపాదించారా? అనేది డబుల్ ఇంజిన్ సినిమా కథ.