
సూపర్ హీరోస్ సినిమాలను ఇష్టపడే అభిమానులకు శుభవార్త. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో సినిమా వస్తోంది. వచ్చే నెల 26న ‘డెడ్ పూల్ అండ్ వోల్వరిన్’ మూవీ విడుదల కానుంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ లీడ్ రోల్స్ చేస్తుండగా షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్ అడ్వెంచరస్ సీన్స్‌తో కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.