బీఆర్ఎస్​లో చేరిన చెరుకు సుధాకర్

బీఆర్ఎస్​లో చేరిన చెరుకు సుధాకర్
  • బీఆర్ఎస్​లో చేరిన చెరుకు సుధాకర్

నల్గొండ, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్​ చెరుకు సుధాకర్..​ బీఆర్ఎస్​లో చేరారు. శనివారం హైదరాబాద్​లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ ​రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సీఎం కేసీఆర్​​తో కలిసి ఉద్యమంలో పాల్గొన్న సుధాకర్.. 2003లో బీఆర్ఎస్​లో చేరారు. ఆ తర్వాత పార్టీలో విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన భార్య లక్ష్మి నకిరేకల్​ ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. 

బీజేపీ విధానాలు నచ్చక తెలంగాణ ఇంటి పార్టీ స్థాపించారు. ఆ పార్టీ తరపున గ్రాడ్యుయేట్​ ఎన్నికల్లో చెరుకు పోటీ చేశారు. ఆ పార్టీని ఇటీవల కాంగ్రెస్​లో విలీనం చేశారు. కాంగ్రెస్​లోనూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఆయనకు రాజకీయంగా విభేదాలు తలెత్తాయి. ఇంకోవైపు ఉదయ్​పూర్​ బీసీ డిక్లరేషన్​ అమలు చేయాలని సుధాకర్​ డిమాండ్​ చేశారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సుధాకర్​ను తిరిగి బీఆర్ఎస్​లోకి రప్పించేందుకు జిల్లా మంత్రి జగదీశ్ ​రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవ తీసుకున్నారు.