- డా. కోట నీలిమ వినతి
పద్మారావునగర్, వెలుగు: పాటిగడ్డ కాలనీ నుంచి రసూల్‌పుర జంక్షన్ వరకు ప్రతిపాదించిన ఫ్లైఓవర్మార్గంతో స్థానిక పేదల ఇండ్లు, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వెంటనే ఆ ప్రణాళికను పునఃసమీక్షించాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ డిమాండ్ చేశారు.
మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను స్థానికులతో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత రూట్ మ్యాప్ వల్ల 40కి పైగా ఇండ్లు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం కలగకుండా స్థానికులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని కోరారు.
