డాక్టర్ పొన్నం ర‌‌విచంద్ర కు జీవన సాఫల్య పురస్కారం

డాక్టర్ పొన్నం ర‌‌విచంద్ర కు జీవన సాఫల్య పురస్కారం
  •     24న మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పురస్కారాల అందజేత
  •     శ్రుతిలయ ఫౌండేషన్, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్, డాక్యుమెంటరీ నిర్మాత డాక్టర్ పొన్నం రవిచంద్రకు ప్రతిష్టాత్మక ఉగాది జీవన సాఫల్య పురస్కారం(లైఫ్​టైమ్ అచీవ్‌‌మెంట్ అవార్డు) దక్కింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ శ్రుతిలయ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఏడాదికి గాను శ్రుతిలయ సీల్ వెల్ -ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారాలు- 2026ను ప్రకటించాయి. 

సినిమా రంగంలో రవిచంద్ర చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్ మహ్మద్ రఫీ, శ్రుతిలయ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి ఆమని తెలిపారు. ఈ నెల 24న నగరంలోని త్యాగరాయ గానసభలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ జి.చిన్నారెడ్డి, హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ చీఫ్ గెస్టులుగా హాజరై పురస్కారాలు అందజేయనున్నారు. డాక్టర్ పొన్నం రవిచంద్ర గతంలో నంది అవార్డుతో పాటు వరుసగా రెండుసార్లు గద్దర్ పురస్కారాలు కూడా అందుకున్నారు.

మీడియా పురస్కార గ్రహీతలు వీరే..

రవిచంద్రతో పాటు వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు మీడియా ప్రతినిధులకు ఉగాది మీడియా విశిష్ట ప్రతిభా పురస్కారాలను ప్రకటించారు. 

    శ్రీనివాసరెడ్డి (సీనియర్ వెటరన్ జర్నలిస్ట్)
    రోజా స్వర్ణ (రాజ్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)
    గాయత్రీరావు (సీనియర్ యాంకర్)
    పరమేశ్వర్ (మన తెలంగాణ చీఫ్ ఫొటో జర్నలిస్ట్)
    వి. స్వర్ణ ప్రియ (ఎన్​టీవీ సీనియర్ ప్రెజెంటర్)
    పొట్లపల్లి స్వరూప (ఐ డ్రీమ్స్ సీనియర్ జర్నలిస్ట్)
    మాధురి జీఎస్ కే (సోషల్ పోస్ట్ సీనియర్ హోస్ట్)
    ఎం.రచన (సీనియర్ హెల్త్ జర్నలిస్ట్)
    ఎం.శ్రీనివాస్ (సీనియర్ కల్చరల్ జర్నలిస్ట్)
    ఎం.కల్పన (వీ6 కల్చరల్ జర్నలిస్ట్)