
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి స్టుజెరాన్ బ్రాండ్‌ను యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (ఈఎంఈఏ) ప్రాంతాల కోసం కొనుగోలు చేసింది. ఇండియా, వియత్నాం కీలక మార్కెట్లలో కూడా అమ్ముతుంది. స్టుజెరాన్‌లో సిన్నరిజైన్ అనే యాంటిహిస్టమైన్ ఉంటుంది.
వెర్టిగో, వెస్టిబ్యూలర్ డిస్టర్బెన్సెస్ లాంటి తల తిరగడం, చెవి సమస్యల చికిత్సకు ఉపయోగపడుతుంది. తాజా డీల్ ద్వారా డాక్టర్ రెడ్డీస్ యాంటివెర్టిగో థెరిప్యూటిక్ విభాగంలో తన స్థానాన్ని బలపరుచుకోనుంది. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ (సీఎన్‌ఎస్) విభాగంలో విస్తరించనుంది.
కంపెనీ సీఈఓ– బ్రాండెడ్ మార్కెట్స్ (ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్) ఎంవీ రమణ ప్రకారం, ఈ బ్రాండ్ కొనుగోలు ద్వారా సీఎన్‌ఎస్ విభాగంలో డాక్టర్ రెడ్డీస్ మరింతగా విస్తరించనుంది. స్టుజెరాన్‌ను ఏపీఏసీ (ఆసియా– పసిఫిక్), ఈఎంఈఏ వంటి 18 కీలక మార్కెట్లలో విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.